Modi: వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ.! 27 d ago
AP: విశాఖపట్నంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ చేరుకుంటారు. సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. వివిధ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వేజోన్‌తో పాటు..కీలక ప్రాజెక్టులపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది.